ఏపీ లోని అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాలు దాడికి దిగాయి.అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ జీసస్ నగర్‌లోని నారాయణ స్కూల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. స్కూల్‌లో విలువైన వస్తువులను, కిటికీ అద్దాలను పగులగొట్టారు. తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులను హింసిస్తున్నారని వారు ఆరోపించారు. అంతేకాకుండా నోటు పుస్తకాలను సైతం తమ వద్దే కొనాలనే నిబంధనను విధించి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. పుస్తకాలున్న గది తాళాలను పగులగొట్టడానికి ప్రయత్నించగా యాజమాన్యం అడ్డుకుంది.