telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అకాళీదళ్ పార్టీతో పొత్తు ఖరారు .. బీజేపీ

bjp alliance with akalidal confirmed

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) లోక్ సభ ఎన్నికల కోసం సమాయాత్తమౌత్తమౌతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, వనరులనూ వినియోగించుకుంటోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతోంది. మరి కొన్ని చోట్ల.. ఇదివరకే ఉన్న పొత్తులను ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తోంది. దీనికోసం నామమాత్రపు సీట్లను తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. తాజాగా పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ. మొత్తం 13 లోక్ సభ స్థానాలు ఉన్న పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ 10 చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన మూడింటిని మిత్రపక్షం బీజేపీకి కేటాయించింది.

అకాళీదళ్ తో పొత్తు ఖాయమైనట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ పంజాబ్ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పటి ఎన్నికల్లోనూ అకాళీదళ్ 10, బీజేపీ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. అకాళీదళ్ నాలుగు సీట్లల్లో, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగలిగాయి. నిజానికి అయిదు సీట్లు కావాలని బీజేపీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ అడిగినన్ని స్థానానలు తాము ఇవ్వలేమని సుఖ్ బీర్ సింగ్ బాదల్ విస్పష్టంగా ప్రకటించడంతో మూడింటితోనే సరిపెట్టుకుంది.

కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్ లో బలంగా ఉంది. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కేప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహాన్ని చూపుతోంది. 13 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగుతోంది.

Related posts