telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పేలుళ్లతో దద్దరిల్లిన సిరియా.. 14 మృతి.. 28 మందికి గాయాలు..

bomb blasts in syria costs 14 lives 28 injured

మరోసారి సిరియా పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుడులో పది మంది మరణించిన ఘటన మరవక ముందే మరో కారు బాంబు దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరియా-టర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని అజాజ్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం టర్కీ విప్లవకారుల అధీనంలో ఉండడం గమనార్హం.

రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి సమీపంలో దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రఖ్కా నగరంలో ఇలాంటి దాడి ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కుర్దిష్‌ నేతృత్వంలోని సిరియన్‌ డెమోక్రటిక్‌ ఫోర్స్‌ ఈ దాడికి బాధ్యత వహించింది.

Related posts