telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

“అనురాగమయీ!”

vedukolu poetry corner
వలపు వయారాల
 విరుల దండవై…
మదిని దోచే మరువంపు 
సుమవల్లివై…
మధుర భావాలు పంచే
 ప్రేమ పావురానివై…
నా హృదంతరాళంలో
ప్రణయ సింహాసనంపై
మహారాణివై…
కుంద పుష్ప వృష్టి 
మందహాసాలు ఒలికిస్తుంటే-
చామంతీ – పూబంతీ
గుసగుసలాడుకుంటున్నాయి-
నిత్య సంక్రాంతి రంగవల్లిగా-
వలపు వాకిట
సిగ్గుల మొగ్గవుతున్న
ఓ ప్రేమ నికషా – యోషా-
నీ పైనే నాధ్యాస-
నీవే నా జన్మ జన్మల
  వలపు కేదారంలో ఆశ-
అనురాగమయీ!
నాదు  ఆత్మ శుద్ధికి 
నాదు లక్ష్య సిద్ధికి
నీవే  ఏకైక శ్రుతం 
నీవే ప్రేమామృతం-
-మహేంద్రాడ సింహాచలాచార్య, టెక్కలి

Related posts