నా మదిని మలుచుకున్న
మాటలకందని మృదు మధురం గా
కలల సౌదనికి కళల నీళ్లు చల్లి
కాగితపు పూలగుత్తులను చేసి
బహుమతి గా ఇవ్వాలని
కళ్ళలో వత్తులు వేసుకొని మరీ
ఎదురు చూశా !
నిశి రాత్రిలో ప్రయాణం
నిశబ్ద వాతావరణం
నిలదీసి అడగలేని మనసు
నిగిడి ఎగసి పడే కోర్కెల జడివాన
నిరు పేద గుండె లో గుబులురేగింది
నింగి నేల కలుస్తాయా అని !
పరువపు పొలములో
పరవశపు ప్రేమ ఝరి
నా మదిని తాకి
ప్రకాశింప చేస్తుందేమోనని ఆశ
అందుకే “నువ్వు వస్తావని “
ఈ ఎదురు చూపుల.. వ్యధ….
-పాపారావు, ముత్తనపల్లి
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్