telugu navyamedia
రాజకీయ

ఉత్తరప్రదేశ్, బీహార్ లకు .. మెట్రో రైలు.. త్వరలో..

Tharuni Ladies Special Metro Station

నగరాలలో ప్రజల ప్రయాణ అవసరాల మేరకు మరియు తీవ్రంగా పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా మెట్రో తెరపైకి వచ్చింది. దేశంలో కూడా ప్రధాన నగరాలలో మెట్రో ఇప్పటికే పరుగులు పెడుతుంది. తాజాగా మరో రెండు రాష్ట్రాలలో కూడా దీనిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్, బీహార్‌వాసులకు శుభవార్త. పట్నా, కాన్పూర్, ఆగ్రా నగరాలలో మెట్రోతో పాటు మీరఠ్- ఢిల్లీ ర్యాపిడ్ రైల్ సిస్టమ్ ఏర్పాటుకు పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ బోర్డు(పీఐబీ) సమ్మతి తెలిపింది. వీటితో పాటు అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2కు కూడా అనుమతి లభించింది. త్వరలో ఈ అంశం కేంద్ర క్యాబినెట్‌లో ప్రస్తావనకు రానున్నదని తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఆయా నగరాల ప్రజలకు మెట్రో కానుక అందే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారికంగా అందిన సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఈ అంశం క్యాబినెట్‌లో చర్చకు రానున్నదని, వెనువెంటనే మంజూరు జరగడంతో పాటు సంబంధిత పనులు ప్రారంభంకావచ్చని తెలుస్తోంది. అదేవిధంగా ఈ పనులకు ఈ నెలలోనే శంకుస్థాపనలు జరిగే అవకాశం కూడా ఉంది. కాగా పట్నా మెట్రోను ఐదేళ్లలో పూర్తి చేయాలని భావిస్తుండగా, ఇక్కడ రెండు మెట్రో కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. అలాగే కాన్పూర్, ఆగ్రాలలో రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాలలో మెట్రో రాకతో ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఢిల్లీ-మీరఠ్ ర్యాపిడ్ రైల్ వస్తే రెండు పట్టణాలకు అత్యంత వేగంగా రాకపోకలు సాగించవచ్చు.

Related posts