తెలుగు తెరపై ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పటి సినిమాల్లో తల్లి, అక్క, వదిన, అత్త పాత్రల్లో మెరిసిపోతున్నారు. నదియా, ఖుష్బూ, తులసి, ప్రగతి, శరణ్య ఆ జాబితాలోకి వస్తారు. తాజాగా స్నేహ, సిమ్రాన్ కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రేణూ దేశాయ్ తో రీఎంట్రీ ఇప్పించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజాగా ఓ నిర్మాత తన సినిమాలో తల్లి పాత్రను రేణూ దేశాయ్ తో చేయిస్తే తన సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని భావించి ఆమెను సంప్రదించాడట. అయితే రేణూ దేశాయ్ తనకు ఆరోగ్యం బాగా లేదంటూ ఈ విషయంపై పెద్దగా ఆసక్తిని చూపలేదట. తల్లి పాత్రను చేయమని రేణు దేశాయ్ ని అడిగిన నిర్మాత బాగా పరిచయమున్నవాడేనట. దీంతో రేణూ దేశాయ్ కు ఏమయ్యింది ? అనే చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో.
previous post
next post