telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో విషాదం…ఉరేసుకుని హీరో ఆత్మహత్య !

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.  అయితే తాజాగా తమిళ నటుడు, నిర్మాత కుమారజన్ (35 ) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కోలీవుడ్ లో విషాదం నెలకొంది. కుమారజన్.. నమక్కాల్ లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని గదిలో ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదు. ఇతను సాంతిప్పోం సింతిప్పోం అనే సినిమా నిర్మించడమే కాక అందులో హీరో గా నటించాడు. కానీ ఈ సినిమా అతనికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా తాను కోరుకున్న గుర్తుంపు రాకపోవడంతో కొంతకాలంగా నిరాశలో ఉన్నాడు. తాను ఊహించినట్లే కెరీర్.. ముందుకు సాగకపోవడంతో మనస్తాపానికి గురయిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏయితే ఆయన మృతి పట్ల సినీ పలుగురు సంతాపం తెలిపారు.

Related posts