telugu navyamedia
సినిమా వార్తలు

శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్ గా న‌టిస్తోన్న సినిమా ‘పుష్ప . పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.’రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో ‘శ్రీవల్లి’ పాత్రలో ఈమె కనిపించనుంది.

ఈ ఫోటోలో పల్లెటూరి యువతిగా మాస్ లుక్​లో రష్మిక అద్దం ముందు కూర్చొని చెవులకు దిద్దులు పెట్టుకుంటూ కనిపించింది. తాంబూలంలో పట్టు చీరతో పాటు పువ్వులు కూడా ఉన్నాయి. శ్రీవల్లి పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది. శ్రీవల్లి ప్రేమను చూసి పుష్పరాజ్ మనసు కరిగింది అంటూ ట్వీట్ చేసింది చిత్రయూనిట్.

Pushpa

ఇందులో అనసూయ, కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శేషాచలం కొండలలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో నిర్మిస్తుండగా..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం.. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప టీజర్, ‘దాక్కో దాక్కో మేక’ పాట చిత్రంపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.

Related posts