telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్

vijayashanthi

లేడీ సూప‌ర్‌స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న న‌ట విశ్వ‌భార‌తి విజ‌య‌శాంతి త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకులను మెప్పించారు. అప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ సినిమాల్లోనూ, విప్ల‌వాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించారు. చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి రీసెంట్‌గా మ‌హేశ్ హీరో గా చేసిన‌‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన భార‌తి పాత్ర‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. బుధ‌వారం విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఆమెకు సినీ సెల‌బ్రిటీలు, అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లను అంద‌జేస్తున్నారు. అలాగే ‘సరిలేరు నీకెవ్వరు’ దర్శకుడు అనీల్ రావిపూడి, నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా విజయశాంతికి బ‌ర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ సందర్భంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా ‘విజ‌య‌శాంతి గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యం, సంతోషం మీ వెంటే ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ విజ‌య‌శాంతికి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు.

Related posts