telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రెండు రోజులలో పెట్టుబడి వసూలు చేసుకున్న.. 118.. విజయోత్సవాలలో యూనిట్ ..

118 movie trailer launch

కళ్యాన్ రామ్ నటుడిగా, నిర్మాతగా రెండు రంగాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘118’ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు సినిమాపై మంచి టాక్ రావటంతో రెండో రోజైన శనివారం కూడా వసూళ్లు బాగానే ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో మంచి టాక్ వచ్చింది.

రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిపోయిందనే అంటున్నారు. ట్రైలర్, టీజర్ రిలీజ్ చేస్తూ కొన్ని రోజుల ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడం… అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా డీసెంటుగా ఉండటంతో తొలి రోజు వరల్డ్ వైడ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఏపీ, తెలంగాణ కలిపి ఆయన ఈ చిత్రాన్ని రూ. 6కోట్లకు కొన్నట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

Related posts