telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

వాట్స్ ఆప్ లో బెదిరింపులా.. ఈ ‘మెయిల్’ కి పిర్యాదు చేయవచ్చు.. : డాట్‌

mail provided by dot for whatsapp affected

సామజిక మాద్యమాలతో ఎంత ప్రయోజనం ఉందొ అంతే స్థాయిలో దుష్ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఎదుర్కోడానికి నిపుణులు, అధికారులు కూడా కలిసి పనిచేస్తున్నారు. దానితో ఇకమీదట ఎవరికైన వాట్సాప్‌లో అశ్లీల, అసభ్యకర సందేశాల వేధింపులకు గురి అవుతున్న వారికి చెక్‌ పెట్టేందుకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం (డాట్‌) నిర్ణయించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాల ద్వారా యువతులను, మహిళలను వేధిస్తున్న కేటుగాళ్ల సంఖ్య పెరిగిపోయంది. ఇటీవల కాలంలో పలువురు పేరొందిన మహిళలు, మహిళా జర్నలిస్టులు కూడా బాధితుల లిస్టులో ఉంటున్నారు.

ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో డాట్‌ అప్రమత్తమయింది. వేధింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక మెయిల్‌ను రూపొందించింది. [email protected] మెయిల్‌కు బాధితులు ఫిర్యాదు పంపిన వెంటనే దాన్ని పోలీసులతోపాటు సంబంధిత ప్రొవైడర్‌ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాట్‌ వెల్లడించింది.

Related posts