telugu navyamedia
సినిమా వార్తలు

సింగ‌ర్‌ మనో శ్రీమతి జమీల మనసులో కోరిక ?

నటుడు, గాయకుడు , సంగీత దర్శకుడు ,డబ్బింగ్ కళాకారుడు అయిన మనో శ్రీమతి పేరు జమీల . ఈమె ను మనో 1985లో వివాహం చేసుకున్నాడు . వీరికి ముగ్గురు సంతానం . జమీల గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తుంది . తన భర్త కు సేవ చెయ్యడమే జీవితమని , అందులోనే తానూ అంతులేని సంతృప్తి పడతాయని చెబుతుంది .

జమీల మీడియా కు దూరంగానే ఉంటుంది . మనో కు కావలసినవి ఎప్పుడూ అందుబాటులో ఉంచడం ,అతని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంలో ఎక్కువ సమయం కేటాయిస్తుంది . అయితే ఈ మధ్య జమీల తన మనసులో వున్న కోరిక ఏమిటో వెల్లడించింది .

అదేమిటో తెలుసుకునే ముందు మనో ఎదిగిన తీరు తెలుసుకుందాం :-
మనో అసలు పేరు నాగూరు బాబు . తండ్రి రసూల్ ఆకాశవాణి విజయవాడలో పనిచేసేవాడు . తల్లి షహీద రంగస్థల కళాకారిణి . 26 అక్టోబర్ 1965లో సత్తెనపల్లిలో జన్మించాడు . తల్లి ,తండ్రి ప్రభావం నాగూర్ బాబు మీద వుంది . ఒకవైపు తల్లితో రంగస్థలంపై నాటకాలు వేస్తూ నేదునూరి కృష్ణమూర్తి దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్నాడు . తల్లితండ్రులతో పాటు మద్రాస్ వచ్చిన నాగూరు బాబు సినిమాల్లో బాల నటుడుగా పరిచయం అయ్యాడు . ఆ యువత ఎమ్మెస్ విశ్వనాథన్ , చక్రవర్తి శిష్యరికం చేశాడు.

Rajinikanth commends Mano

1985లో ఇళయరాజా నాగూరు బాబు పేరును మనో గా మార్చి ” పూ విజ్హి వాసలిలే ” అన్న తమిళ సినిమాలో ” అన్నే అన్నే నీ ఎన్నా సొన్న ” పాటతో గాయకుడుగా పరిచయం చేశాడు . 1986లో నాగార్జున నటించిన ‘విక్రమ్ ” సినిమాలో “డింగ్ డాంగ్ ” అనే పాటను చక్రవర్తి మనోతో పాడించాడు . అలా మనో తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ , ఒరియా, హిందీ , బెంగాలీ ,మొదలైన 11 భాషల్లో ఇప్పటి వరకు 25,000 పాటలు పాడాడు . ఇక ప్రైవేట్ పాటలు మరో 25, 000 పాడి ఉంటాడు .

Alitho Saradaga Show Latest Promo Singer Mano And Wife Jammela Update  Jameela Tolywood Ali Chandra Mukhi Dialogus K Vishwan-TeluguStop

1985లో తెనాలికి చెందిన జమీలను వివాహం చేసుకున్నాడు . మనో కేవలం గాయకుడుగానే కాదు నటుడుగా, సంగీత దర్శకుడుగా , రజనీ కాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద‌ హీరోలకు డబ్బింగ్ కాళాకారుడుగా, దేశంలోనూ , విదేశాల్లోనూ కచేరీలు ఇస్తూ బహుముఖాలుగా ఎదిగాడు . అయినా ఇప్పటికీ ఒదిగి ఉంటాడు .

Surprising: Singer Mano joins that political party!

తెలుగు, తమిళ ,కన్నడ, మలయాళ భాషల్లో అనేక అవార్డులు వచ్చాయి. ఇక సన్మానాలు, సత్కారాలకు లెక్కలేదు. పేరు ప్రఖ్యాతులు కొదువలేదు . అయినా మనో పడ్డ కష్టానికి , ఎదిగిన స్థాయికి తగిన గుర్తింపు రాలేదని , ఆ విషయంలో కొంత అసంతృప్తి గానే ఉందని మనో శ్రీమతి జమీల పేర్కొన్నారు .
మనో లాంటి కళాకారుడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి “పద్మశ్రీ ” అవార్డు ప్రకటించాలని జమీల తన మనసులో వున్న కోరిక చెప్పేసింది. ఎప్పటికైనా తన భర్తను పద్మశ్రీ అవార్డు వరించాలని ఆమె కోరుకుంటోంది .
– భగీరథ

Related posts