telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

బంపర్ ఆఫర్… రూ..777కే బైక్…!

Bike

సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన టూవీలర్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు పెంచుకునేందుకు సూపర్ డిస్కౌంట్ అందిస్తోంది. టూవీలర్ కొనుగోలుదారులు తక్షణ రుణ సదుపాయం, జీరో ప్రాసెసింగ్ ఫీజు, క్యాష్‌బ్యాక్ వంటి పలు ఆపర్లు పొందొచ్చు. బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే కొంత డౌన్‌ పేమెంట్ చెల్లించాలి. ఇది సాధారణంగా రూ.8,000 నుంచి రూ.10,000 మధ్యలో ఉండొచ్చు. అయితే సుజుకీ మాత్రం కేవలం రూ.777కే బైక్ లేదా స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లే ఆఫర్ అందిస్తోంది. అంటే రూ.777 డౌన్ పేమెంట్ చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాకుండా లోన్ ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఇస్తోంది. సుజుకీ యాక్సెస్ 125, బర్గ్‌మన్ 125, జిక్సర్, ఇన్‌ట్రూడర్ వంటి పలు టూవీలర్లను అతితక్కువ డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకెళ్లొచ్చు. తక్షణ రుణ సదుపాయం ఉంది. తీసుకున్న రుణాన్ని 48 నెలల్లోగా తిరిగి చెల్లించాలి. ఈజీ ఫైనాన్స్‌తోపాటు జిక్సర్, యాక్సెస్ టూవీలర్లపై ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా రూ.3,000 వరకు ప్రయోజనం కల్పిస్తోంది. అంతేకాకుండా పేటీఎం నుంచి ఈ టూవీలర్లను బుక్ చేసుకుంటే రూ.8,500 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతేకాకుండా కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. బైక్ లేదా టూవీలర కొనుగోలు చేస్తే కస్టమర్లకు 22 క్యారెట్ల గోల్డ్ కాయిన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా టూవీలర్ కొనుగోలుదారులు లక్కీడ్రాలో గెలుపొంది మారుతీ సుజుకీ స్విఫ్ట్ కారు పొందొచ్చు.

Related posts