telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారు: అంబటి

YCP Ambati Slams to JD Laxminaryana

ప్రాంతీయ విభేదాలు తలెత్తకుండా ఉండేందుకే జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో అభివృద్ధి వికేంద్రీకరణ కోరుతూ ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అమరావతి పేర చంద్రబాబు జోలె పట్టి నాటకాలాడుతున్నారని ఆరోపించారు.

హైకోర్టును కర్నూలులో, సెక్రటేరియట్ ను విశాఖలో, శాసనసభను అమరావతిలో పెట్టాలని నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారు చేస్తున్న ఉద్యమం అభివృద్ధికోసం కాదని, ఆస్తుల కోసమని దుయ్యబట్టారు.ప్రభుత్వం న్యాయంగా నిర్ణయంచేసి దానికి తగ్గ పరిహారం రైతులకు  ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Related posts