telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు..

ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. చిడతలు వాయిస్తూ టీడీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడబోతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుకుని చిడతలు కొడుతూ భజన చేశారు.

సభలో ఈ విధంగా వ్యవహరించడం సరికాదని.. అసలు ‘మీరు’ శాసనసభ్యులేనా… ‘‘మీకు సంస్కారం ఉందా, ఇంగిత జ్జానం లేదా అంటూ మండిపడ్డారు. శాసనసభ ఔన్నత్యాన్ని దిగజార్చుతున్నారు..సభలో విజిల్స్ వేస్తారు. భజన ఇక్కడ కాదు బయటకు వెళ్లి వాయించుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.

మానవత్వం లేని వ్యక్తుల్లా వ్యవహిరిస్తున్నార‌ని, మీకు ఓటేసిన ప్రజలు చూస్తున్నారు. ఇవి పిల్లచేష్టలు’’ అంటూటీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు టీడీపీ సభ్యులు  తీరుపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సెటైర్లు పేల్చారు. చివరకు చంద్రబాబుకు చిడతలు కొట్టుకోవాల్సిందేనని.. వీరు సభకు తాగొస్తున్నారేమోననే అనుమానంగా ఉందని.. డ్రంకెన్ టెస్ట్ చేయాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.

చంద్రబాబుకు చిడతలు కొట్టించుకోవడం బాగా అలవాటు అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆ అలవాటు వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా వచ్చిందని.. చిడతలతో సభలో అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలానే చేస్తే తండ్రి కొడుకులు 2024 తర్వాత చిడతలు తీసుకోవడమేనన్నారు.

Related posts