telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రారంభమయిన ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్..

*నేడు ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్
*బరిలో 14 మంది అభ్యర్థులు
*ఈ నెల 26న ఫలితాలు

ఆత్మకూరులో ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్ధులు ఉన్నారు .మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది

ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 ఓటర్లుండగా ఇందుకోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 131 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భారీ యెత్తున పోలీసు బలగాలను మొహరించారు. మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంది.ఈ నెల 26న ఫలితాలు వెలువడుతాయి.

Related posts