telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వారినే చైర్మన్‌ చేయండి..

* కొండపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు రియాక్ష‌న్‌
* ఎస్ఈసీ, ఏపీ డీజీపీపై ఆగ్రహం
* తమ పార్టీ సభ్యుల ఓర్పును చేతగానితనంగా చూడొద్దు..
*వారినే చైర్మన్‌ చేయండంటూ చంద్ర‌బాబు ఆగ్ర‌హం

కొండపల్లి మున్సిప‌ల్ చైర్మన్‌ ఎన్ని వాయిదాపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా విధ్వంసం సృష్టించి వాయిదా వేయించడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన అన్నారు. ఎన్నిక నిర్వహణ రాకపోతే ఎస్‌ఈసీ, డీజీపీలు తప్పుకోవాలని ధ్వజమెత్తారు. ఎన్నిక అడ్డుకోవడమెందుకు.. వైసీపీ వారినే చైర్మన్‌ చేయండి అంటూ మండి పడ్డారు.

టీడీపీ సభ్యులను లోబర్చకోని కొండపల్లిలో పాగా వేయాలని చూస్తున్నారన్నారు. కౌన్సిల్‌ కార్యాలయంలోకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నారన్నారు. ఇంత జరుతుగున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యుల ఓర్పును చేతగానితనంగా చూడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ హితవు పలికారు. కాగా..ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప జిల్లా వరద బాధితులకు ప‌రామ‌ర్శించడానికి వెళ్ళారు.

Related posts