telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అంతరిక్ష యాత్రికుడి .. మృతి..

first space walker died

అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తి అలక్సీ లియోనోవ్ కన్నుమూశారు. 85ఏళ్ల వయస్సులో మాస్కోలో ఆయన కన్నుమూశారని శుక్రవారం రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తన వెబ్ సైట్ లో తెలిపింది. అయితే ఏ కారణం చేత అతను చనిపోయారన్నది మాత్రం తెలుపలేదు. అయితే కొన్ని ఏళ్లుగా లియోనోవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రష్యన్ మీడియా తెలిపింది. లియోనోవ్ పశ్చిమ సైబీరియాలోని ఒక పెద్ద రైతు కుటుంబంలో 1934 లో జన్మించాడు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ హయాంలో లెక్కలేనన్ని సోవియట్ రైతుల మాదిరిగానే, అతని తండ్రిని అరెస్టు చేసి గులాగ్ జైలు శిబిరాలకు పంపించారు, కాని అతను ఎలాగోలా బతికి బట్టగట్టి తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడు.

చిన్నతనంలో లియోనోవ్ కి బలమైన కళాత్మక ఆశక్తి ఉండింది. అతను పైలట్ శిక్షణా కోర్సులో, తర్వాత ఓ ఏవియేషన్ కాలేజీలో చేరే ముందు ఆర్ట్ స్కూల్‌కు వెళ్ళడం గురించి ఆలోచించాడు. లియోనోవ్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు కూడా స్కెచింగ్‌ను వదల్లేదు. 1975 లో అపోలో-సోయుజ్ విమానంలో వెళ్లేటప్పుడు తనతో పాటు కొన్ని రంగు పెన్సిల్స్ ని కూడా తీసుకెళ్లాడు. మార్చి 18, 1965 న లియోనోవ్ అంతరిక్ష చరిత్రలో తన స్థానాన్ని సంపాదించాడు. స్పేస్ వాకింగ్ ఎల్లప్పుడూ అధిక ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. లియోనోవ్ స్పేస్‌సూట్ అంతరిక్ష శూన్యంలో గాలితో నిండి ఉబ్బిపోవడంతో అతను అంతరిక్ష నౌకలోకి తిరిగి రాలేకపోయాడు. దీంతో అతను హాచ్ ద్వారా సరిపోయేలా ఉండటానికి తన స్పేస్ సూట్ నుండి ఆక్సిజన్ బయటకు పోయేందుకు ఒక వాల్వ్ తెరవవలసి వచ్చింది. లియోనోవ్ 12 నిమిషాల స్పేస్‌వాక్ చేశాడు.

Related posts