telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ : … పోరాటం ఆపే ప్రసక్తి లేదు.. ఆర్టీసీ కార్మికుల ఏకకంఠం..

tsrtc union on strike until merge

ఎన్ఎంయూ నేత ఎం.నరేందర్ ఆర్టీసీ పరిరక్షణకు కార్మికుల పోరాటం నిరంతరం నడుస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ హెచ్ 2 డిపోల ముందు కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు ప్రదర్శన కూడా నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని ఈ కార్యక్రమాలకు హాజరైన ఆర్టీసీ కార్మికుల ఐక్యకార్యాచరణ సమితి(జేఏసీ), నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు మౌలానా, సత్యం తదితరులు… తమ డిమాండ్లను ఆమోదించేంతవరకు పోరుబాటలో విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

ఇది మా ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమం కాదని, ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఈ ఉద్యమం నడుస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా సహృదయంతో ఆర్టీసీ కార్మికులకు సహకరిస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

Related posts