telugu navyamedia
రాజకీయ

మోదీకి సెల‌వులు లేవా..?

సెప్టెంబర్ 17తో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1978లో ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు.2001లో కేశూభాయి పటేల్, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. 2012 శాసనసభ ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

PM Narendra Modi wishes Imran Khan a speedy recovery from COVID-19

ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2001 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.గుజరాత్ రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని ప‌క్క దేశం అయిన అమెరికా అభివర్ణించింది. సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో మరల గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు..

Narendra Modi enters 20th year as democratically elected head of  government- The New Indian Express

కాగా.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, నేటి వరకు మోదీ సెలవు తీసుకోకుండా పని చేస్తున్నారని బీజేపీ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దేశం కోసం, ప్రజల కోసం ఆయ‌న‌ నిరంతరం సేవలు అందిస్తున్నార‌ని అన్నారు. గత 21 ఏళ్లుగా ప్రజాసేవలో గ‌డేపుస్తున్నార‌ని, కోవిడ్ కాలంలో భారతదేశం పనితీరు ప్రపంచ దేశాల అభినందనలు అందుకొందని , ఇదంతా మోదీగారి వ‌ల్లే సాధ్యం అయ్యింద‌ని బీజేపీ ఆ పార్టీ నాయకులు వాద‌న‌..

DD India på Twitter: "PM @narendramodi to address @nasscom Technologies and  Leadership Form this afternoon, theme of forum is 'Shaping the future  towards a better normal'; forum a vibrant platform to bring

Related posts