telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ప్రకాశం జిల్లాకు .. వైసీపీ సేన ఇదేనా..?

YCP padma comments Chandrababu

ఇప్పటికే టీడీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒకఅడుగు ముందు ఉండనే నేపథ్యంలో వైసీపీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను విడుదల చేసింది. ముందుగా చెప్పినట్టుగా నోటిఫికేష‌న్ రాగానే ప్ర‌క‌టిస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించినా తన మనసు మార్చుకున్నట్టే ఈ తాజా జాబితా తెలుపుతుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ అభ్య‌ర్థుల జాబితా ఖ‌రార‌య్యింది. జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది ఆ పార్టీ.

ఆ జాబితా :

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి
కొండెపికి మాదాసు వెంకయ్య
కందుకూరు నుండి మానుగుంట మహీధర్‌రెడ్డి
కనిగిరి నుండి బుర్రా మధుసూదన్‌యాదవ్
ద‌ర్శి నుండి మద్దిశెట్టి వేణుగోపాల్
ఎర్రగొండపాలెం నుండి ఆదిమూలపు సురేష్
గిద్దలూరు నుండి అన్నా రాంబాబు
సంతనూతలపాడు నుండి టిజెఆర్ సుధాకర్‌బాబు
అద్దంకి నుండి బాచిన చెంచుగరటయ్య
పర్చూరు నుండి దగ్గుబాటి చెంచురాం హితేష్
చీరాల నుండి ఆమంచి కృష్ణమోహన్ పేర్లు ఖాయం అయ్యాయి.

ఇక మార్కాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌కే వెంక‌ట‌రెడ్డికే అవ‌కాశాలున్నాయి. ఆయ‌న‌కే జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వ‌డం ఖాయం అయితే మొత్తం అన్ని స్థానాల‌లోనూ అభ్య‌ర్థుల ఎంపిక పూర్తయిన‌ట్ట‌గానే భావించాలి. ఇదిలా ఉండగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. రానున్న ఎన్నికల్లో తనకే టిక్కెట్ కేటాయించాలని వైవి జగన్‌ను కోరుతున్నారు. ఢిల్లీలో జాతీయస్థాయి నాయకులతో చర్చించే సమయంలో జగన్ ఆనవాయితీగా తన బాబాయి సుబ్బారెడ్డిని తీసుకెళ్లినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో జిల్లా రాజకీయాలపై వచ్చే శుక్రవారం వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్, వైవి సుబ్బారెడ్డికి రాజకీయంగా తగిన ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన సన్నిహితవర్గాలు గూఢగుసలాడుతున్నాయి.

Related posts