telugu navyamedia
రాజకీయ

రాత్రికి రాత్రే వెన‌క్కి వెళ్ళిన సముద్రం ..

బంగాళాఖాతంలో కొన్నిరోజులుగా విచిత్ర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఓ చోట పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న సముద్రం…మరోచోట కనిపించకుండా పోతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఇలాంటి ఘటనే జరిగింది.

అన్నా చెల్లెలు గట్టు సమీపంలో 500 మీటర్లు ముందుకు వచ్చి, నాలుగు గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వెళ్లింది. సముద్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ ప్రదేశం అంతర్వేది. సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది తీరంలో సాధారణంగా అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి.

ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘమైన తీరప్రాంతంలో సముద్ర ఎగుమతులు ఏపీ నుంచే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ కోస్తా తీరం..అందమైన పల్లెలకు, బీచ్ లకు ప్రసిద్ధి. మత్స్యకారులకు జీవనాధారమైన సముద్రంలో గత కొన్ని రోజులుగా విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

నిత్యం సముద్రం ముందుకు చొచ్చుకొస్తూ స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్లను ముంచేస్తుంటుంది. బుధవారం కూడా అలలు ముందుకొచ్చి ఓ హోటల్ ను ముంచెత్తాయి. దీంతో అది ధ్వంసమైంది. సముద్రం ముందుకు చొచ్చుకురావడంతో స్థానికులంతా భయాందోళనకు గురై అటువైపు వెళ్లడం మానేశారు.

అయితే గురువారం ఉదయం తీరప్రాంతానికి వెళ్లిన ప్ర‌జ‌ల‌కు షాకింగ్ దృశ్యం కనిపించింది. నిన్న ఎగసిపడిన అలలు ఈరోజు మాయమయ్యాయి. కేవలం ఇసుక మేటలు మాత్రమే కనిపిస్తున్నాయంట‌.

కాగా, పౌర్ణమి పోటుతో అంతర్వేది బీచ్‌లో బుధవారం సముద్ర కెరటాలు ఎగసిపడ్డాయి. కెరటాలు తీరాన్ని దాటుకుని ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో అమావాస్య పోటుతో ఆరు రోజులు పాటు ఉగ్రరూపం దాల్చిన సముద్రం ప్రస్తుతం పౌర్ణమి పోటుకు అదే రీతిలో భయపెడుతోంది. 

ఇప్పుడు ఏకంగా 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది. ఈ అనూహ్య మార్పులకు కారణాలేంటో తేల్చాలని అధికారులకు విన్నవిస్తున్నారు.

Related posts