telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ముర్ము ప్రమాణ స్వీకారం

kashmir leftnent governor

ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు కేంద్రం అక్టోబర్ 31ని రీఆర్గనైజేషన్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్‌ అవతరించాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా గిరీష్ చంద్ర ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ నేపథ్యంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు లెహ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ గీతా మిట్టల్ లడక్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ గా రాధాకృష్ణ మాథుర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారడంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గగా, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి పెరిగింది.

Related posts