దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కాశ్మీర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ.. టెక్నీషియన్స్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి 13 సంవత్సరాల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. ఆ విషయాన్ని వారు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ పలికిన స్వాగతాన్ని గౌరవిస్తున్నట్లుగా నటి విజయశాంతి కూడా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘‘అనిల్ రావిపూడిగారు మరియు మహేష్ బాబుగారు.. మీ స్వాగతాన్ని గౌరవిస్తున్నాను. వ్యక్తిత్వం అనేది వ్యక్తిలోని ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. వాతావరణం మారవచ్చునేమో గానీ వ్యక్తిత్వం ఎన్నటికీ మారదు. మీరెలాగో.. నేనూ అలాగే..- విజయశాంతి’’ అని తన ట్వీట్‌లో తెలిపారు. ‘మీరు మళ్లీ వెండితెర అరంగేట్రం చేస్తున్నందుకు మేమంతా హ్యాపీ’ అంటూ మహేష్‌బాబు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రీ-ట్వీట్స్ చేస్తున్నారు.
previous post