telugu navyamedia
సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” కథ ఆ హాలీవుడ్ సినిమాకు ప్రేరణా ?

ismart sankar shooting started

పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా కనపడనున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ లుక్‌లో రామ్ కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ హాలీవుడ్ చిత్రం ప్రేరణగా రూపొందుతోందని సమాచారం. 2016లో క్రిమినల్ అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రంలో ఓ సీఐఎ ఏజెంట్ ఓ హ్యాకర్ ని పట్టుకోవటం కోసం చేసే ప్రయత్నంలో చనిపోతాడు. అప్పుడు అతని మెమరీస్ ని ఓ క్రిమినల్ ట్రాన్సఫర్ చేస్తారు. అప్పుడు ఆ క్రిమినల్, ఈ సీఐఎ ఏజెంట్ జ్ఞాపకాలతో మేల్కొంటాడు. అప్పుడు అతని లక్ష్యం ఒకటే ఆ హ్యాకర్ ని పట్టుకోవటం. ఆ హ్యాకర్ ని పట్టుకోకపోతే మూడో ప్రపంచ యుద్దానికి దారి తీసే పరిస్దితి ఉంటుంది. అప్పుడు సీఐఎ ఏజెంట్ గా మారిన ఆ క్రిమినల్ ఆ హ్యాకర్ ని ఎలా పట్టుకున్నాడు అనేది కథాంశం. రేపటి నుంచి వారణాసిలో భారీ యాక్షన్ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించేందుకు వారణాసి లొకేషన్ ఎంపిక చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర నటీనటులు ఆశిష్ విద్యార్ధి, సాయాజీ షైన్, దీపక్ శెట్టి, తులసి పాల్గొననున్నారు. సతీష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పూరి జగన్నాధ్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌లో భారీ హంగులతో ఈ ఫైట్ సీన్స్ తెరకెక్కనున్నాయి.

Related posts