తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు విజయశాంతి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్‌గా వచ్చిందని కామెంట్ చేశారు.. కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు తెలంగాణ వచ్చాక చేసే పనులకు పొంతనలేదన్న విజయశాంతి.. భౌగోళిక తెలంగాణ వచ్చింది.. కానీ, సామాజిక తెలంగాణ రాలేదు.. అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తెలంగాణ సంతోషంగా లేదు… మానసిక బాధతో నలిగిపోతుందన్నారు విజయశాంతి… విద్యారంగం కోమలో ఉంది.. వైద్యం వెంటిలేటర్‌పై ఉంది.. రైతులు చనిపోతున్నారు.. తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. ఇక, కరోనా వల్లనే బీజేపీ స్పీడ్ తగ్గిందన్నారు విజయశాంతి.. సీఎం కేసీఆర్ పై మరో ఉద్యమం చేయాల్సివస్తోందన్న ఆమె… బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగు పడుతుంది… గాడి తప్పిన తెలంగాణ గాడిలో పడుతుంది..అద్భుతమైన పాలన బీజేపీ అందిస్తుందని చెప్పుకొచ్చారు.. కేసీఆర్ దొరల పాలన పోవాలి.. ఆయన కుటుంబానికి తప్పతెలంగాణకి మేలు జరిగింది ఏమీలేదని పేర్కొన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ