2019 వన్డే ప్రపంచకప్‌కి అంబటి రాయుడిని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. అయితే మెగా టోర్నీలో అతడు ఆశించిత మాత్రం రాణించలేదు. అయితే తాజాగా మాట్లాడుతూ… ‘నేను పరుగులు చేయాలంటే క్రీజులో ఎక్కువ సమయం గడపాలి. అలా అని ఓపెనింగ్ చేస్తానని అనట్లేదు. 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నా. ఒక స్లాట్ ముందుగా పంపిస్తే బాగుంటుంది. అప్పుడు నేను పరుగులు చేయకపోతే.. జట్టు నుంచి తప్పించినా ఓకే. గత రెండేళ్లలో నేను కోల్పోయినది అదే. నేను ఆల్‌రౌండర్‌ని. కానీ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే పేరుగాంచాను. ఆల్‌రౌండర్ అయినంత మాత్రాన 6-7 స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని ఏమీ లేదు. నేను జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్ లాంటివాడిని కూడా కావచ్చు. వారు ఓపెనింగ్ చేస్తారు, మూడో స్థానంలో ఆడతారు. అలానే బౌలింగ్ చేస్తారు. అలానే నేను కూడా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి పరుగులు, వికెట్లు తీయగలిగితే జట్టుకు మంచిదే కదా’ అని విజయ్ శంకర్ తెలిపాడు.
previous post
next post