telugu navyamedia
సినిమా వార్తలు

రేచీకటితో వెంకీ, నత్తితో వరుణ్ న‌వ్వులే న‌వ్వులు..!

సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేశ్, వరుణ్‌ తేజ్ రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత హంగామా సృష్టించిందో అందరికి తెలిసిందే. రెచ్చిపోదాం బ్రదర్‌’ అంటూ ఇద్దరూ సందడి చేసి కరోనా టైంలో కూడా అందరికి అల‌రించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో దీనికి సీక్వెల్ గా వెంకీ, వరుణ్‌ మళ్లీ ‘ఎఫ్‌ 3’ ఫన్, ఫ్రస్ట్రేషన్‌తో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు.

Venkatesh and Varun Tej are back with F3 | Entertainment News,The Indian  Express

 

కాగా ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది. వరుణ్‌ అయితే నత్తి నత్తిగా మాట్లాడుతూ ఓ రేంజ్‌లో నటిస్తున్నాడట. ఎఫ్ 2 మాదిరే ఎఫ్ 3లో కూడా వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తుంది. ఎఫ్ 3 గా రాబోతున్న ఈ చిత్రం మరింత నవ్వులు పంచనుంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు అంచనా.

F3 confirms its release date: Venkatesh and Tamannaah starrer to arrive on  August 27 | Telugu Movie News - Times of Indiaదీన్ని బట్టి వెండితెరపై వెంకీ, వరుణ్‌ల ఫన్‌ ‘ఎఫ్‌ 2’ను మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తు‍న్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుందట‌. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 ఎంత పెద్ద విజయం సాధించిందో అంద‌రికీ తెలిసిందే..

Related posts