ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో ఏపీకి కేంద్రం నిధులు విడుదల చేసింది. ఏపీలో ధాన్యం సేకరణ, చెల్లింపులపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై వెంకయ్య స్పందించారు. రైతుల సమస్యలపై ఆయన ఇటీవలే పలువురు కేంద్రమంత్రులతో మాట్లాడారు.
రైతుల నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపులపై వారితో చర్చించారు. ఎఫ్ సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతోనూ చర్చించారు. వెంకయ్య చర్చల ఫలితంగా కేంద్రం శుక్రవారం ఎఫ్ సీఐకి రూ.2.498.89 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఎఫ్ సీఐ ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది.