telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ చంద్రుడిపైకి .. అమెరికా.. 2024కి ప్రణాళిక..

NASA ready to work with ISRO

అమెరికా అంతరిక్ష సంస్ధ నాసా ఏరో స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెని లాక్‌హీడ్‌ మార్టిన్‌తో మెగా ఒప్పందం చేసుకుంది. 2024 నాటికి చంద్రుడి వద్దకు మళ్ళీ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన ఒరియన్‌ క్యాప్సుల్స్‌ను ఆర్డర్‌ ఇచ్చింది. దాదాపు 3 బిలియన్‌ డాలర్లను కేటాయించి వ్యోమగాములుచంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళేందుకు అవసరమైన మూడు ఒరియన్‌ క్యాప్సుల్స్‌ నిర్మించేందుకు ఈ కేటాయింపులు జరిపింది.

తొలి దశలో భాగంగా 2.7 బిలియన్‌ డాలర్లతో మూడు క్యాప్సుల్స్‌తో కలిపి 3 నుండి 5 అర్టెమి మిషన్స్‌ను కంపెనీ రూపొందిస్తుంది.. ఒక్కొక్క క్యాప్సుల్‌ నలుగురు వ్యోమగాలను తీసుకెళ్ళగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అర్టెమి మిషన్స్‌ 6 నుండి 8 కోసం 2022 ఆర్థిక సంవత్సరంలో 1.9 బిలియన్‌ డాలర్లను కేటాయించి మరో మూడు క్యాప్సుల్‌కు ఆర్డరిచ్చే యోచనలో నాసా ఉన్నది. ఆ తరువాత మరో ఆరు క్యాప్సుల్స్‌కు ఆర్డరివ్వాలని నిర్ణయించినట్లు నాసా నుండి వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది.

ఈ ఒప్పందం వచ్చే దశాబ్దంలో ఆరియన్‌ ఉత్పత్తిని సురక్షితం చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త విజ్ఞానాన్ని అందుకునేందుకు, వ్యోమగాములను అంగారకునిపైకి పంపే సన్నాహాల కోసం చంద్రుడి వద్ద స్ధిరమైన ఉనికిని నెలకొల్పడానికి నాసాకు గల నిబద్ధతను ఈ ఒప్పందం వెల్లడిస్తుందని నాసా అధికారి జిమ్‌ బ్రిడెన్‌స్టీన్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts