telugu navyamedia
రాజకీయ

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన మోదీ

ఎట్ట‌కేల‌కు రైతుల‌కు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ చెప్పారు..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. గురునానక్​ జయంతి సందర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కీలక ప్రకటన చేశారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మోదీ.. భార‌త దేశ ప్రజలకు, రైతులకు ఆయన ఈ సందర్భంగా క్షమాపణలు కోరారు.

శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటామని, దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు త‌మ కుటుంబాలు ద‌గ్గ‌ర‌కు వెళ్లాలని కోరారు.

Taking Sufferings Of Farmers Seriously

తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, అయితే ఎంత ప్రయత్నించినా  ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ. 

మూడు వ్యవసాయ చట్టాల లక్ష్యం రైతులను ముఖ్యంగా చిన్న రైతులను బలోపేతం చేయడమేనని ఆయన అన్నారు..  ఐదు దశాబ్దాల నా ప్రజా జీవితంలో రైతుల కష్టాలను, సవాళ్లను తెలుసుకున్నామ‌ని అన్నారు.

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. 2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు.రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ. 1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాది నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా.. ఫలించలేదు. అయితే.. ఇన్ని రోజుల తర్వాత నేడు వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గింది కేంద్రం.

మోదీ తాజాగా ప్రకటన పై దేశ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురు నానక్ జయంతి రోజున మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఇక ముందు కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందని అమరీందర్ అన్నారు.

Related posts