telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అప్పుల ఊబిలో .. పాక్, అయినా ఆర్మీ బడ్జెట్ భేష్..! యుద్ధం వస్తే.. ఇవన్నీ వేస్టే..!

pak will lose if war declared with india

పుల్వామా ఘటన .. ఇండియా-పాక్ మధ్య ఉన్న కొద్దీ పాటి స్నేహబంధాన్ని కూడా పూర్తిగా తెంచేసినట్టుగానే ఉన్నాయి. తాజా ఘటనతో ఇక భారత్, దాయాదిపై చర్యలు తీసుకోకుంటే.. ప్రభుత్వాన్నైనా కూల్చేసేట్టుగా ఉన్నారు ప్రజలు. దీనితో ఇరు దేశాల మధ్య వాతావరణం తీవ్రంగా వేడెక్కుతుంది. ఇదే తరుణంగా గతంలో చెప్పినట్టుగా రెండవ సెర్జికల్ ఎటాక్ కు భారత్ సిద్ధం అవ్వాల్సిందేనా..! అయితే అప్పుడు పాక్ తీసుకునే మొదటి అడుగు ఏమై ఉండవచ్చు.. తిరుగు దాడి చేస్తుందా.. అణ్వస్త్రాలు ప్రయోగిస్తుందా.! ఇదే సందు అనుకోని చైనా, పాక్ తో కలిసి నడుస్తుందా..! అసలు ఇదే మూడవ ప్రపంచ యుద్దానికి పునాది కానుందా.. ! అంటూ పాక్ తీసుకునే చర్యలపై అనేక అనుమానాలు ప్రస్తుతం అందరి మదిలో తీవ్రంగా ఉన్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే, ఎప్పటి నుండో కసిగా ఉన్న సైన్యం.. గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక భారత ప్రభుత్వానికి కూడా వేరే దారిలేదు.. ఈసారి వెనకడుగు వేస్తే, ప్రభుత్వాలే కూలిపోతాయి. అందుకే ఇప్పటికే ప్రధాని, సైన్యానికి ఈ విషయంలో సర్వహక్కులు ఇచ్చేసినట్టే తెలుస్తుంది. ఇందులో భాగంగా సర్జికల్‌ దాడుల నుంచి పాక్‌లోని కీలక ఉగ్రనేతలను మట్టుబెట్టడం, అణుస్థావరాల ధ్వంసం దాకా పలు మార్గాలను మన భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయని తెలుస్తోంది.

అయితే విశ్లేషకులు మాత్రం..పాకిస్థాన్‌ ప్రస్తుతం చాలా బలహీనంగా కనిపిస్తోందని, ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షిణించిందని, ఆ దేశ మంత్రులు, ఉన్నతాధికారులు వాడుతున్న విలాసవంతమైన కార్లను, ఇతరత్రా ఖరీదైన వస్తువులను వేలం వేసి సొమ్ము సమకూర్చుకుంటున్నదుస్థితి అంటున్నారు. ఆ దేశ రక్షణ రంగ పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నందునే, 2018-19లో ఆ దేశ రక్షణ బడ్జెట్‌ 56 వేల కోట్ల రూపాయలు కేటాయించడం మాత్రం విశేషం. ఈ కేటాయింపులు సాధారణం కంటే ఎక్కువ అయినప్పటికీ పాక్ ను రక్షిస్తాయా..!

గతంలో సర్జికల్‌ దాడులు జరిపినప్పుడు అలాంటివేమీ జరగలేదని తన ప్రజలకు చెప్పుకొనే ప్రయత్నం చేసిందే తప్ప కనీస ప్రతిదాడి చేయలేకపోయింది. నిజంగానే పాకిస్థాన్‌ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తుంది. అంటే ఆత్మాహుతి దాడులతో దొంగ దెబ్బలు తీయడం తప్ప, స్వయంగా యుద్ధభూమిలో అడుగు పెట్టలేదని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక మన త్రివిధ దళాలతో పోలిస్తే.. పాక్‌ సైన్యం, వైమానికదళం, నౌకాదళం అన్నీ బలహీనంగా ఉన్నాయి. ఏవీ భారత్‌కు పోటీనిచ్చే స్థితిలో లేవు. భారత్‌ కొనుగోలు చేస్తున్న రాఫెల్‌ యుద్ధవిమానాలకు దీటైన యుద్ధవిమానాలు సమకూర్చుకునే స్థోమత కూడా పాక్‌కు లేదు.

pak will lose if war declared with indiaవీటన్నిటినీ పక్కన పెట్టినా.. పాకిస్థాన్‌ గనక భారత్‌పై ఎగబడితే ఆర్థికంగా మరింత నష్టపోతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల భారంలో మునిగిపోయి బావురుమంటున్న పాక్‌ ఆర్థిక వ్యవస్థ.. సంప్రదాయ యుద్ధమంటూ జరిగితే పూర్తిగా మునిగిపోతుంది. మనకు పాకిస్థాన్‌తో మాత్రమే లైవ్‌ బోర్డర్‌ ఉంది. కానీ.. పాక్‌ దుష్ట విధానాల కారణంగా ఆ దేశానికి మూడు వైపులా లైవ్‌ బోర్డర్‌ ఉంది. ఇటీవలే పాక్‌-ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలో ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌’పై దాడికి పాల్పడిన ఓ సాయుధ ముఠాకు పాక్‌ ఆర్మీ సాయం చేసింది. ఆ దాడిలో డజను మందికి పైగా ఇరాన్‌ సైనికులు చనిపోయారు. దీనితో పాక్‌పై ఇరాన్‌ గుర్రుగా ఉంది.

ఏదో సామెత చెప్పినట్టుగా, శత్రువుకు శత్రువు మిత్రుడనే నెపంతో.. భారత్‌తో యుద్ధమంటూ వస్తే చైనా తమకు అండగా నిలబడుతుందని పాకిస్థానీలు భావిస్తున్నారు. కానీ, అది కూడా జరిగే అవకాశం లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, అదే జరిగితే భారత్‌కు తమ ఉత్పత్తుల ఎగుమతి పూర్తిగా నిలిచిపోతుందనే విషయం చైనాకు తెలుసు. అంతేకాదు, మనదేశంలో ఉన్న చైనా కంపెనీల ఉత్పత్తి, పరిశోధన విభాగాలు మూతపడతాయి. దీనివల్ల అంతర్జాతీయంగా ఆ దేశ ఉత్పత్తులకు భారీ నష్టం కలుగుతుంది. ఇది ఆ దేశానికి ఆర్థికంగా దెబ్బ. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని.. 1965, 1999లలో భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించిందో చైనా ఈసారి కూడా యుద్ధం వస్తే అలాగే వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts