ఎంత దూరం ప్రయాణించినా.. వెనక్కి తిరిగి చూసుకుంటే… మనిషి తప్ప ఇంకేవీ మారలేదు, ఒక్కసారి తరచి చూసుకోండి. మనిషి ఆహారంలో అనేక మార్పులు వచ్చేశాయి. ఆ మార్పులతోనే సమస్యలు కూడా ప్రారంభం అయ్యాయి. రుచికి ప్రాధాన్యం ఇచ్చి, ఏదేదో తింటూ .. అనారోగ్యాన్ని కొనుక్కొని మరి తెచ్చేసుకుతున్నారు. ఇవన్నీ మనలో మనం అనుకుంటున్నవి కావు, దీర్ఘకాలంగా జరిగిన ఒక పరిశోధన వెల్లడించిన నివేదికలు ఇవి. మనిషి ఆహారపు అలవాట్లను మార్చుకుని తనకు తాను హాని చేసుకుంటున్నాడు. ప్రపంచానికీ ముప్పు తెస్తున్నాడు. కొత్తతరహా ఆహారపు అలవాట్లతో మనిషి ఎలాంటి అనర్థాలను కొనితెచ్చుకుంటున్నదీ ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’ కళ్లకు కట్టింది. ఈ అనవసర ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడున్న ఆహార అలవాట్లను సంపూర్ణంగా మార్చుకోవాలని విస్పష్ట హెచ్చరిక చేసింది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు సంబంధించి లాన్సెట్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
‘ఈట్-లాన్సెట్’ కమిషన్ అందించిన వివరాలతో ఈ నివేదికను వెలువరించింది. 16 దేశాలకు చెందిన 37 మంది శాస్త్రసాంకేతిక నిపుణులతో మూడేళ్లపాటు పనిచేసి ఆ సంస్థ ఈ నివేదిక రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని, వాతావరణ మార్పులకు (క్లెయిమెట్ ఛేంజ్) అవే ప్రధాన కారణమని గుర్తుచేసింది. ఈ అలవాట్లే ప్రపంచ మానవాళిని, నాగరికతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. మాంసం, పాలపదార్థాల(డెయిరీ) వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, శాకాహార వినియోగాన్ని బాగా పెంచుకోవాలని నివేదిక స్పష్టంచేసింది. భూమండలంపై ఉన్న సహజ వనరుల సమతౌల్యాన్ని కాపాడుకోలేకపోతే జనాభాకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యంకాదని హెచ్చరించింది.
ఈ నివేదికలో కొన్ని ముఖ్యంశాలు :
* 2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యికోట్లకు చేరుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకుంటేనే అప్పటికి వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది.
* ప్రపంచంలో 82కోట్ల మంది తగినంత ఆహారం తీసుకోవడం లేదు. అంతకుమించిన జన సంఖ్య నాసిరకమైన ఆహారం తీసుకుంటోంది.
* రెడ్‌మీట్, పాలపదార్థాల వినియోగం ఏమాత్రం పెరిగినా ఇబ్బందులు తప్పవు. రెడ్‌మీట్, చక్కెరలాంటి ఆనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు 50%కి మించి తగ్గాలి.
* గింజలు, పండ్లు, కూరగాయల వినియోగం 100% పైగా పెరగాలి.
* అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యేటా 1.1 కోట్ల మంది అకారణంగా మృత్యువు పాలవుతున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అవాంఛిత ఆహారం తీసుకుంటున్నారు.
* గత 50 ఏళ్లుగా ప్రధానంగా తీసుకుంటున్న ఆహారం వాతావరణ మార్పునకు ప్రధాన కారణమైంది.
ఆకట్టుకుంటున్న “కలర్ ఫోటో” టీజర్… ఈ సుహాస్‌ని తొక్కేయాలి బ్రహ్మాజీ కౌంటర్