telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మద్యంప్రియులకు శుభవార్త..తెలంగాణలో ఇక బార్లు ఓపెన్..!

liquor shops ap

మద్యంప్రియులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో మార్చి 22న మూతపడ్డ బార్లు తిరిగి తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు తెరవవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

బార్లు, క్లబ్ లు కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలిపారు.  ప్రవేశ ద్వారం వద్దనే కస్టమర్లకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహించాలి. లోపలికి వెళ్లేప్పుడు తప్పని సరిగా క్యూపద్దతిని పాటించాలని సూచించారు. అయితే వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా టీఎస్ ప్రభుత్వం క్రమంగా ఒక్కొక్కదానికి అనుమతి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇక బార్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Related posts