వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇక నుంచి రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఆయా షోరూం డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కలిపించింది. ఈ విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తేనున్నది. కేంద్ర ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండునెలల క్రితం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మార్చి 31 వరకు రూపొందిస్తారు. నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలకు మాత్రమే షోరూంల వద్ద రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. డీలర్లు తప్పుచేస్తే భారీ జరిమానాతోపాటు, డీలర్‌షిప్‌ను కొన్ని నెలలపాటు సస్పెండ్ చేయ నున్నారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణాశాఖ ఆఫీసులకు రావాల్సి ఉంటుంది.
ఉల్లి కోసం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి: లోకేశ్