శ్రీకాంత్ హీరోగా షాలోం స్టూడియోస్ బ్యానరుపై రూపొందుతున్న చిత్రం ‘సంభవం’. ప్రముఖ నృత్య దర్శకుడు ధినేష్ మరో హీరో. పూర్ణ, సృష్టిటాంగేలు కథానాయికలు. బక్రీద్ చిత్రంలో నటించిన బేబి శృతిక, కిశోర్, దర్శకుడు ఎ.వెంకటేశ్, తంబిరామయ్య, మొట్టైరాజేంద్రన్, జయప్రకాశ్‌లు ఇతర తారాగణం. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఇదులో శ్రీకాంత్, ధినేష్, పూర్ణ, సృష్టిటాంగేలతో పాటు పలువురు పాల్గొన్నారు.
నిర్మాత థాను, పేరరసు, వెంకటేశ్, ధరణి, తిరుమలై, నటుడు నట్టిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకుడు వెంకటేశ్ వద్ద శిష్యరికం చేసిన రంజిత్ పారిజాతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ మనసాక్షికి కట్టుబడి జీవించే ఓ వ్యక్తి.. కొన్ని గడ్డు పరిస్థితులతో తప్పటడుగు వేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. కొన్ని వాస్తల ఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.