telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్’ నిర్వ‌హిస్తున్న డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌కి అభినంద‌న‌లు తెలిపిన స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.

రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హాయ‌స‌హ‌కారాల‌తో ‘తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’ ఆధ్వ‌ర్యంలో’ టిఎఫ్‌సిసి నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023′ వేడుక‌లు ఆగ‌స్ట్ 12న దుబాయ్‌లోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత నంది అవార్డ్స్ వేడుకలు కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల గ‌త 7 సంవ‌త్స‌రాలుగా జ‌ర‌ప‌డం లేదు. దీన్ని లీడ్ తీసుకుని డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ నిర్వ‌హించ‌డం చాలా ఆనంద‌క‌రం. నావంతు స‌హ‌కారం ఉంటుంద‌ని తెలిపారు.

‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ వ్య‌క్తిగతంగా నాకు చాలా ఇష్ట‌మైన వ్య‌క్తి. ఏ ప‌ని మొద‌లుపెట్టినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మాక్రుడిలా ఆ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేస్తారు. ఇప్పుడు నంది అవార్డులు కూడా చాలా స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హిస్తార‌ని నా ప్ర‌గాఢ విశ్వాసం. దీనితో పాటు ‘మా’ స‌భ్యులు కూడా ఈ అవార్డ్స్ తీసుకోవ‌డం ఆనంద‌దాయ‌కం.

డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు.. నేను నంది అవార్డ్స్ ఇస్తున్న విష‌యం తెలుసుకుని న‌న్ను అభినందించ‌డంతో పాటు త‌మ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్ప‌డం సంతోషం. ఇండ‌స్ట్రీలో ఉన్న చాలామంది నిర్మాత‌లు, న‌టీన‌టుల స‌హ‌కారం ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. మూవీ ఎంట్రీస్‌కు కూడా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. జూన్ 15తో ఎంట్రీస్ గ‌డువు ముగుస్తుంద‌ని తెలియ‌జేశారు.

Related posts