తనను బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోస్టులు పెడుతున్నారని వంగవీటి రాధా రోపించారు. వైసీపీకి రాజీనామా చేయడంపై రాధా విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా కొన్ని వాట్స్ యాప్ గ్రూపుల్లో తనను బెదిరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోస్టులు పెడుతున్నారని రోపించారు. తనను చంపేయించదలచుకుంటే ఆ పని చేయించుకోవచ్చని వైసీపీలో ఎన్నో అవమానాలు భరించానని అన్నారు.
నన్ను చంపితే నీకు నిజంగా శాటిస్ ఫాక్షన్ వస్తుందని అనుకుంటే, నన్ను చంపేసేయండి తాడూ బొంగరం లేనోడిని అని వ్యాఖ్యానించారు. నాకు అన్నింటికంటే ముఖ్యం నా తండ్రి ఆశయమని, పేద ప్రజలు బాగుండాలనే తనతండ్రి పోరాటం చేశారని గుర్తు చేశారు. పేద ప్రజల పట్టాల కోసమని ఆయన ఆనాడు పొరాడి ప్రాణాలు అర్పించారన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజల్లో కొనసాగాలని అనుకున్నానని ఆయన అన్నారు. పార్టీలో చేరినప్పుడు జగన్ తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువన్నారని, తమ్ముడికి ఇలా చేస్తే, సామాన్య ప్రజలకు ఏం చేస్తారని రాధా ప్రశ్నించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లుద్వారా మహిళలకు అన్యాయం: ఒవైసీ