telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశమంతటా 2 నెలలు లాక్‌డౌన్ పెట్టాల్సిందే.. ఐసీఎంఆర్ సూచన

lockdown hyd

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అధికంగా కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలను మరో 6 నుంచి 8 వారాల పాటు లాక్ డౌన్ చేయాలని ఐసీఎంఆర్ సూచనలు చేసింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం 528 జిల్లాల్లో 10 శాతం పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని చెప్పిన ఆయన..అధిక పాజిటివిటీ ఉన్న జిల్లాలను మూసేయాలని పేర్కొన్నారు. లేనిచో దేశానికి ప్రమాదం తప్పదన్నారు.

Related posts