telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రేపు “వకీల్ సాబ్” నుంచి సర్ప్రైజ్…!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలిలు కీ రోల్స్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. ఇక ఎలాగో రేపు పవన్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో హంగామా అప్పుడే షురూ అయ్యిపోయింది. చిత్ర యూనిట్ అంతా కూడా ఇప్పుడు ఒక అధికారిక అప్డేట్ ను కూడా ఇచ్చేసారు. ఈ చిత్ర నిర్మాణ సంస్థలు తారాగణం సహా ఇతర టెక్నిషియన్స్ కూడా “వకీల్ సాబ్” నుంచి రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఒక సంథింగ్ స్పెషల్ ఉందని ఊరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రేపు టీజర్ విడుదల కానుందనే వార్తలు విన్పిస్తున్నాయి. మరి చిత్ర యూనిట్ ఇంకా ఏం ప్లాన్ చేశారు అన్నది మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. మరి వీరు ప్లాన్ చేసిన ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటో తెలియాలి అంటే రేపు పవన్ పుట్టినరోజు వరకు ఆగాల్సిందే.

Related posts