telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీతో కలిసి కొనసాగడం శివసేన చేసిన తప్పు: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

కేవలం హిందుత్వ కోసమే 25 ఏళ్లుగా బీజేపీతో కలిసున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను మతంతో ముడిపెట్టి ఇన్నాళ్లు పెద్ద తప్పు చేశామని అన్నారు. బీజేపీతో కలిసి కొనసాగడం కూడా శివసేన చేసిన మరో పెద్ద తప్పని ఆయన అభివర్ణించారు. ఇంతకాలం పక్కా హిందుత్వ నినాదంతో రాజకీయాలను నడిపిన ఉద్ధవ్ నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాలు జూదంలాంటివని, సరైన రీతిలోనే రాజకీయాలు చేయాలని చెప్పారు. ఈ విషయాన్ని తాము మర్చిపోయి రాజీకీయాలను మతంతో ముడిపెట్టామని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన మమతా బెనర్జీ, రాంవిలాస్ పాశ్వాన్, పీడీపీలతో చేయి కలిపిన చరిత్ర బీజేపీదని విమర్శించారు.పొత్తు ధర్మం గురించి మాట్లాడితే సరిపోదని, దానికి కట్టుబడి ఉండాలని ఉద్ధవ్ అన్నారు.

Related posts