విశాఖ నగరంలోని పరవాడ ఫార్మాసిటీలో సోమవారం ఉదయం గ్యాస్ కలకలం రేపింది. వ్యర్థ జలాల పంప్ హౌస్ లో గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ ఘటనలో మణికంఠ, దుర్గాప్రసాద్ మృతి చెందారు. వీరిది పాయకరావుపేటగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా విశాఖలో గ్యాస్ లీక్ ఘటనలు మామూలు అయిపోయాయి. గతేడాది మేలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పాయారు. అంతేకాకుండా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఏడాది సెప్టెంబరులో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇప్పుడీ ఘటనతో మరోసారి విశాఖ వాసులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల యాజమాన్యం మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని ప్రజలు వాపోతున్నారు.
తెలంగాణలో అయిపోయింది…ఏపీలో టీడీపీని బంగాళాఖాతంలో కలపడమే !