telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన టీఆఎస్ ఆర్టీసీ…

TSRTC

మన తెలుగు రాష్ట్రలో సంక్రాంతి, దసరా ను చాలా పెద్దగా జరుపుకుంటారు. అందుకు ఈ పండుగలు వస్తున్నాయి అంటే చాలు సిటీలో ఉన్న అందరూ ఇంటికి చేరడానికి చూస్తారు. అయితే ఇప్పుడు కూడా సంక్రాంతి పండుగ సమయం దగరికి రావడంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది టీఆఎస్ ఆర్టీసీ.. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తంగా 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ రీజినల్ మేజనర్ వరప్రసాద్ తెలిపారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు నడపనుండగా… ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 1,600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఇక, ఈ ప్రత్యేక బస్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా, కరోనావైరస్‌ వ్యాప్తి తర్వాత.. చాలా కాలం డిపోలకే పరిమితం అయ్యాయి.. ఆర్టీసీ బస్సులు.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి.. కార్గో సేవలను ప్రారంభించింది ఆర్టీసీ.. ఇక, ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు సుదీర్ఘకాలమే రద్దు అయ్యాయి.. మొత్తంగా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదరడంతో మళ్లీ బస్సులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ సంక్రాంతికి ఆర్టీసీ ఎంత లాభం పొందుతుంది అనేది.

Related posts