telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వాట్సాన్…

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ షేన్ వాట్సాన్ అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో చెన్నై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వాట్సాన్.. నిన్న ఆ జట్టు చివరి మ్యాచ్ పంజాబ్ తో ఆడిన తర్వాత డ్రెసింగ్ రూమ్ లో ”ఇక తాను అన్ని ఐపీఎల్ తో కలిపి రకాల క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు తన జట్టు సభ్యులకు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే 2015 ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత 2016 లో అంతర్జాతీయ క్రికెట్ కు రెటైర్మెంట్ ప్రకటించాడు. 2008 నుండి ఐపీఎల్ లో ఆడుతున్న వాట్సాన్ మొదట రాజస్థాన్ రాయల్స్ కు ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. ఇక 2018 వేలంలో చెన్నై అతడిని కొనుగోలు చేసింది. ఆ ఏడాది ఫైనల్లో అతడు అద్భుత శతకంతో జట్టుకు విజయాన్ని అందించాడు. అనంతరం తర్వాతి ఏడాది ముంబయితో జరిగిన తుదిపోరులోనూ గొప్పగా పోరాడాడు. అంతేగాక 2008లో రాజస్థాన్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 145 మ్యాచ్ లు ఆడిన వాట్సాన్ మొత్తం 3874 పరుగులు, 92 వికెట్లు అలాగే 40 క్యాచ్ లు అందుకున్నాడు.

Related posts