telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ముంబయిలో .. చంద్రయాన్ గణేష్ .. ఈసారి ప్రత్యేకత ..

సాధారణంగా ప్రత్యేకత అనగానే అందరు ఆకర్షితులవుతారు. ఇక పండుగలంటే ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఈ వినాయక చవితికి కూడా వీధుల్లో పలు రకాలుగా ఉండే గణేశ్‌ ప్రతిమలు దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా ఆకట్టుకునే వినాయక ప్రతిమలను చూసేందుకు జనాలు ఉత్సాహం చూపిస్తారు. ఈ ఏడాది ముంబయిలోని లాల్‌ బగ్చా దేవాలయంలో వినాయకుడిని ప్రత్యేకంగా రూపొందించారు.

చంద్రయాన్‌ 2 ఉపగ్రహాం విశేషాలను తెలిపే విధంగా ఈ గణేశ్‌ ప్రతిమను రూపొందించారు. గణేశ్‌ విగ్రహానికి ఇరు వైపులా ఇద్దరు వ్యోమగాములను కృత్రిమంగా ఏర్పాటు చేశారు. తల వెనుక భాగంలో చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని ఉంచారు. ఈ వినాయకుడి ప్రతిమ వెనుక భాగంలో ఓ తెరను ఏర్పాటు చేసి సౌర కుటుంబంలో గ్రహాల వ్యవస్థను తెలియజేస్తున్నారు. చంద్రయాన్‌ 2కు సంబంధించిన విశేషాలను పూర్తిగా వివరించేలా స్క్రీన్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ వినాయకుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Related posts