telugu navyamedia
తెలంగాణ వార్తలు

మోదీ సర్కార్‌ను గద్దె దించుతాం – ఎమ్మెల్సీ కవిత

మోదీ సర్కార్‌ను గద్దె దించేవ‌ర‌కు వ‌దిలిపెట్ట‌మ‌ని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు..జీడీపీ పెంచమంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైర్‌ అయ్యారు..

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందన్న కవిత..తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందని విమర్శించారు.

Our Entire Cabinet Is Protesting': TRS Leader Kavitha Demands Centre To  Roll Back LPG, Fuel Prices

క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేదని.. ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిందన్నారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను రూ. 400 తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్‌పై మండిపడ్డ ఆమె.. వాళ్లను, వీళ్లను జైలులో పెట్టిస్తా అంటాడు.. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణకు సబ్సిడీపై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించాలని సూచించారు

అలాగే..తెలంగాణలో రైతులు ఆందోళనలో ఉన్నారు.. బీజేపీ నేతలు అనేక మాటలు చెబుతున్నారు.. కానీ, ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts