telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేసీఆర్ ను గద్దె దించడం పెద్ద పనేం కాదన్న రేవంత్

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి… కేసీఆర్‌, మోడీ సర్కార్‌ లపై నిప్పులు చెరిగారు.  హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వ‌ద్ద జ‌రుగుతున్న మహాధర్నా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఆఖరి పోరాటమ‌ని.. తెలంగాణ విముక్తి కోసం పోరాటమ‌ని అన్నారు.

 ​కేసీఆర్‌కి అండగా ఉన్న మోదీని బండకేసి కొట్టాల‌ని.. గల్లీలో ఉన్న కేడి.. ఢిల్లీలో ఉన్న మోదీ ఇద్దరు ఒకటేన‌ని.. కేంద్రం, రాష్ట్రం పన్నుల రూపంలో న్నుల రూపంలో ప్రజల నడ్డి విరుస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమన్నారు. నరేంద్ర మోదీ ఛాయ్‌ అమ్మిన రైల్వే స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కట్టిందేన‌ని.. కాంగ్రెస్ పార్టీ రైల్వే స్టేషన్ లు కడితే.. మోదీ రైళ్లు అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.

PM Modi chairs high-level meeting over Covid situation - Coronavirus Outbreak News

 ఒకప్పుడు ఈ సంస్థలను పెట్టి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. జాతి సంపదను ప్రధాని మోదీ… అధాని, అంబానీలకు పంచి పెడుతున్నారు. మేము ఇద్దరం… మాకు ఇద్దరు అనే రీతిలో దేశాన్ని పట్టి పీడిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారిగా దేశం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు .అన్ని పార్టీలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇప్పుడు ఎన్నికలు లేవు.. మాకు ఎటువంటి రాజకీయాలు లేవని.. దేశం, రాష్ట్రం గురించే మా పోరాటమ‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల విలువైన భూములను కేసీఆర్ తన బంధువులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

Centre's Covid-19 aid to Telangana is 'next to nothing', says KCR | Business Standard News

తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆటలు సాగవన్నారు. అందరం అనుకుంటే సీఎంను గద్దె దించడం పెద్ద పనేం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రం, దేశం పెను ప్రమాదం లో ఉందని…మోడీ, కేసీఆర్ కు వ్యతిరేకంగా కలసి పోరాడుదామని పిలుపునిచ్చారు. భారత్ బంద్ లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండాలన్నారు.

Related posts