telugu navyamedia
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్‌కు జ‌గ్గారెడ్డి రాజీనామా?

*కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచ‌న‌లో జ‌గ్గారెడ్డి..
*నా వ‌ల్లే ప్రొబ్ల‌మ్ అయితే నేను వెళ్లిపోతా..
*కోవ‌ర్ట్ అని ప్రచారం చేస్తున్నారు..
*రేపు సంగారెడ్డిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం..
*పార్టీ రాష్ర్ట నాయ‌క‌త్వంపై తీవ్ర అసంతృప్తి..
*భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ ప్ర‌కటించే యోచ‌న‌

ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ రాష్ర్ట నాయ‌క‌త్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్న జ‌గ్గారెడ్డి ఈ మేరకు తన ముఖ్య ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు స‌మాచారం. రేపు మరోసారి సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Related posts