telugu navyamedia
రాశి ఫలాలు

ఫిబ్రవరి 19, శనివారం రాశిఫలాలు..

మేషరాశి..

స‌మాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం పాల‌వుతారు..ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ‌స్తు, వాహనాలు కొనుగొలు చేస్తారు. వ్యాపారాల్లో కాస్త మార్పులు ఉంటాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

వృషభరాశి..

అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబబాధ్యతలతో సతమతమవుతారు. ఆరోగ్యసమస్యలు ఎక్కువ‌వుతాయి. కొందరి ప్రవర్తన వల్ల బాధ కలిగిస్తాయి. ఉద్యోగ‌స్తుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు సాధారణస్థాయిలో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుప‌డుతుంది.

మిథునరాశి..

అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతాలు ప‌య‌నం అవుతారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత అవ‌స‌రం. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారుజ‌

కర్కాటకరాశి..

నూత‌న‌ కార్యక్రమాలకు శ్రీకారం చుడ‌తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య‌మైన ప‌నుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మీయుల ఆదరణ ల‌భిస్తుంది. దైవదర్శనాలు చేస్తారు. నిరోద్యోగుల‌కు ఉద్యోగ‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

సింహరాశి..

కుటుంబంలో చికాకులు ఎదుర‌వుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు . ధనం అధికంగా ఖ‌ర్చు అవుతుంది. బంధువర్గంతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలకు ఆఫీసుల్లో ఇబ్బందికరంగా ఉంటాయి. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు.

కన్యరాశి..

కుటుంబ స‌భ్యులు నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. విద్యార్ధులు ప‌రీక్ష‌ల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహం సాగుతాయి.

తులరాశి..

ఉద్యోగ‌స్తులు ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర‌వుతాయి. సోదరులతో కలహాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు మంద‌గిస్తాయి. బంధుమిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చికరాశి..

శత్రువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహ‌రించ‌డం మంచిది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వస్తులాభాలు ఉంటాయి. భూవివాదాలు సర్దుకుంటాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాల్లో పురోగతి ఏర్ప‌డుతుంది. ఆర్థిక ప‌రిస్థి అంతంతమాత్రంగా ఉంటుంది.

ధనుస్సురాశి..

ప్రారంభించిన పనులలో ఊహించని ఫలితాలు ఉంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం ల‌భిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. యత్నకార్యసిద్ధి ఏర్ప‌డుతుంది.

మకరరాశి..

మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొన్ని ఒప్పందాలలో జాప్యం ఏర్ప‌డుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు ఉంటాయి. ఆల‌యాలు ద‌ర్శించుకుంటారు.

కుంభరాశి..

విద్యార్థినులు భయాందోళనలు వీడి పట్టుదలతో శ్రమిస్తే విజ‌యం సాధిస్తారు. భూ త‌గాదాలు కొలిక్కి వ‌స్తాయి. వృథా ఖర్చులు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండ‌వు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనరాశి..

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. విద్యార్థులకు కొంత ఊరట ల‌భిస్తుంది.దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

Related posts